Gujarath: మినీ మోదీతో ప్రధాని మోదీ... వీడియో చూడండి!

  • గుజరాత్ లో జోరుగా మోదీ ప్రచారం
  • అచ్చం తనలానే కనిపించిన ఓ బుడతడు
  • వేదికపైకి పిలిపించుకుని మోదీ ముచ్చట్లు
  • నెట్టింట వైరల్ అయిన వీడియో
తన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న వేళ, అచ్చు మోదీలానే దుస్తులు ధరించి, మెడలో కాషాయం రంగు స్కార్ప్ తో, కళ్లజోడు, తెల్లని గడ్డం అదనపు హంగులుగా, అవే హావ భావాలను ప్రదర్శిస్తున్న ఓ బాలుడు ప్రధానిని ఆకట్టుకున్నాడు. వెంటనే ఆ బాలుడిని వేదికపైకి పిలిపించుకున్న మోదీ, ఆ కుర్రాడితో మాట్లాడి ఉత్సాహపరిచారు.

నవసరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ బాలుడు ఇప్పుడు 'మినీ మోదీ'గా మారిపోయాడు. చివరికి మణికట్టుకు కూడా తనలాగే నల్లదారాలు కట్టుకుని కనిపించిన ఆ బాలుడి ఫోటోను మోదీ, స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పరిచయం చేయడం గమనార్హం. ఈ మినీ మోదీని ప్రధాని మోదీ కలిసిన వీడియోను మీరూ చూడవచ్చు.
Gujarath
Narendra Modi
Mini Modi

More Telugu News