Madhyapradesh: ఆటపట్టించిన భర్త.. ప్రాణాలు తీసుకున్న భార్య!

  • ఫొటో తీసి వాట్సాప్‌లో పెడతానన్న భర్త
  • మనస్తాపంతో విషం తాగిన భార్య
  • ఇండోర్‌లో విషాదం
సరదాగా భార్యను ఆటపట్టించడమే అతడు చేసిన నేరమైంది. మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. ఇండోర్‌కు చెందిన డాక్టర్ నళిన్ పాట్నీ స్కిన్ స్పెషలిస్ట్. అతని భార్య  సోనా దంత సంబంధ సమస్యతో బాధపడుతుండడంతో ఇటీవల ఆమెను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెకు ముందు పన్ను పాడైందని, దానిని తొలగించి కొత్తది అమర్చాల్సి ఉంటుందని దంత వైద్యుడు చెప్పాడు.

పన్ను పాడైన విషయంపై భార్య సోనాను నళిన్ ఆటపట్టించడం మొదలుపెట్టాడు. వైద్యుడు ముందు పన్ను తొలగించిన రోజున ఫొటో తీసి వాట్సాప్‌లో పెడతానని, దానికింద ‘ నా భార్య ముసలిదైపోయిందని, పళ్లు ఊడిపోయాయని’ కామెంట్ రాస్తానని సరదాగా ఆటపట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనా గదిలోకి వెళ్లి కాసేపటి తర్వాత బయటకు వచ్చి తాను విషం తాగానని చెప్పడంతో భర్త విస్తుపోయాడు. వెంటనే తేరుకున్న నళిన్ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Madhyapradesh
Doctor
Whatsapp

More Telugu News