dinner: గోల్కొండ కోటలో కేసీఆర్ విందు షురూ!

  • గోల్కొండ కోటలో జీఈఎస్ అతిథులకు విందు
  • 150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులు
  • కేసీఆర్ ఇస్తున్న విందులో వివిధ రకాల ఆహారపదార్థాలు
హెచ్ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 కు హాజరయిన 150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదు చారిత్రక వారసత్వ సంపద గోల్కొండ కోటలో ప్రత్యేక విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు హెచ్ఐసీసీ నుంచి అతిథులు బస్సుల్లో గోల్కొండ కోటకు చేరుకున్నారు.

గోల్కొండ కోటలోని పచ్చిక బయళ్లలో ఈ విందు జరుగుతోంది. ఈ విందులో తెలంగాణ, హైదరాబాదు ప్రతిష్ఠను పెంచే ఘుమఘుమలాడే వంటకాలను వండి వార్చారు. విదేశీ రుచులతో పాటు బిర్యానీ, మొఘలాయ్, ఇటాలియన్, చైనీస్ రకాల వంటకాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రకృతి, కోట అందాలను వీక్షిస్తూ అతిథులు డిన్నర్ ను ఆస్వాదిస్తున్నారు. 
dinner
golkonda fort dinner
KCR
telangana
Hyderabad

More Telugu News