నాకు పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు!: తనపై వస్తోన్న రూమర్లపై వ్యంగ్యంగా స్పందించిన సాయిధరమ్ తేజ్!
- ఒక పాపకి ఆరేళ్లు.. ఒకరికి రెండేళ్లు
- నా సంసారం హాయిగా సాగుతోంది
- పదేపదే రూమర్లను రాసిందే రాస్తున్నారు
- నేను కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతా
తనపై వస్తోన్న రూమర్లను ఎన్నిసార్లు ఖండించినా కొందరు రాసిందే మళ్లీ మళ్లీ రాసి ప్రచారం చేస్తున్నారని సాయిధరమ్ తేజ్ అన్నాడు. అందుకే తాను కూడా తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని పదే పదే చెప్పుకుంటున్నానని వ్యంగ్యంగా చెప్పాడు. ఎవరు ఎలా రాసుకున్నా తానేం అనబోనని అన్నాడు. తనపై ఎన్నో రూమర్లు వస్తున్నాయని తెలిపాడు.