bomb terror: బాంబు బెదిరింపు నిందితుడ్ని పట్టేశాం: డీసీపీ సత్యనారాయణ

  • బాంబు బెదిరింపును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, పోలీస్ శాఖ
  • మౌలాలి నుంచి ఫోన్ వచ్చినట్టు నిర్ధారణ
  • నిందితుడు బొంత ఎల్లయ్య
నిన్న రాత్రి హైదరాబాదులోని ప్రతిష్ఠాత్మక ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ విందునిచ్చిన సందర్భంగా, ఆ ప్యాలెస్ లో బాంబు ఉందంటూ ఒక వ్యక్తి ఫోన్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడిని మౌలాలికి చెందిన బొంత ఎల్లయ్య (60) గా గుర్తించామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బొంత ఎల్లయ్య తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు. ఆయన ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స కూడా తీసుకున్నాడని వెల్లడించారు. 
bomb terror
fuliknuma palace
south zone dcp
styanarayana

More Telugu News