ishta dutta: బాలీవుడ్ నటుల వివాహానికి హాజరైన అజయ్ దేవగణ్!

  • మాజీ మిస్ ఇండియా తనూశ్రీ దత్తా చెల్లెలు ఇషితా దత్తా
  • 'టార్జాన్: ద వండర్ కార్' ఫేమ్ వాత్సల్ సేఠ్
  • జూహులోని ఇస్కాన్ మందిరంలో రహస్య వివాహం
టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన తనూశ్రీ దత్తా ('ఆషిక్ బనాయా ఆప్నే' ఫేం) సోదరి ఇషితా దత్తా వివాహం రహస్యంగా జరిగింది. ఇషితా దత్తా గత కొంత కాలంగా వాత్సల్ సేఠ్ ('టార్జాన్: ద వండర్ కార్' ఫేమ్) తో డేటింగ్ లో ఉంది. ముంబైలోని జూహులో గల ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్‌ నెస్ (ఇస్కాన్) మందిరంలో రహస్యంగా వీరి వివాహం జరిగింది.

ఈ వివాహానికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్- కాజోల్ దంపతులు, బాబీ డియోల్, సొహైల్ ఖాన్ కూడా హాజరయ్యారు. హిందూ వివాహ పధ్ధతిలో జరిగిన వీరి వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, అజయ్‌ దేవ్‌ గణ్ 'దృశ్యం' సినిమాలో ఆయన పెద్ద కుమార్తెగా ఇషితా దత్తా నటించింది. ప్రస్తుతం ఆమె కపిల్ శర్మకు జతగా ‘ఫిరంగి’ సినిమాలో నటిస్తోంది. వాత్సల్య సేఠ్ ‘హాసిల్’ అనే సీరియల్‌లో నటిస్తున్నాడు.
ishta dutta
vatsal seth
Bollywood
stars
marriage

More Telugu News