vijay devarakonda: విజయ్ దేవరకొండ న్యూ మూవీ టైటిల్ 'షికార్'

  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 
  • క్యాబ్ చుట్టూ తిరిగే కథ  
  • క్యాబ్ డ్రైవర్ పాత్రలో విజయ్ దేవరకొండ 
  • డాక్టర్ పాత్రలో ప్రియాంకా  జవాల్కర్    
యూత్ లో విజయ్ దేవరకొండకి ఇప్పుడున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తదుపరి చిత్రం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. కథ కూడా క్యాబ్ చుట్టూనే తిరుగుతుంది .. అందువలన ఈ సినిమాకి 'షికార్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం.

 యూత్ తో పాటు మాస్ ఆడియాన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా .. డాక్టర్ పాత్రలో ప్రియాంకా జవాల్కర్ కనిపించనుంది. ఇక ఈ సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలోను విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు. ఇవే కాకుండా ఆయన చేతిలో మరో మూడు .. నాలుగు ప్రాజెక్టులు వున్నాయి. వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ వరుసగా ఆడియన్స్ ను అలరిస్తాడన్నమాట.
vijay devarakonda
priyanka

More Telugu News