sai dharam tej: 'కేటీఆర్ వచ్చాకే మోదీ రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే...': సాయి ధరమ్ తేజ్ కామెంట్!

  • కేటీఆర్ ను ప్రధాని ఎందుకు పిలిచారో తెలియదు
  • ఆయన డైనమిక్ లీడరని చెప్పేందుకు ఈ ఘటన చాలు
  • టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్
నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తున్న వేళ జరిగిన ఆసక్తికర ఘటనపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. మియాపూర్ మెట్రో స్టేషన్ లో రిబ్బన్ కట్ చేసేముందు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రధాని స్వయంగా కేసీఆర్ ను అడగడం, ఆపై కేటీఆర్ వచ్చిన తరువాత రిబ్బన్ కట్ చేయడం మీడియాలో వైరల్ కాగా, పలువురు స్పందిస్తున్నారు.

సాయిధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ, "మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే... కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలు" అని వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌కు మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.
sai dharam tej
KTR
Narendra Modi

More Telugu News