maggi noodles: మ్యాగీ నూడిల్స్ కు మళ్లీ చిక్కులు.. భారీ జరిమానా

  • ల్యాబ్ టెస్టులో విఫలమైన నెస్లే
  • రూ. 45 లక్షల జరిమానా
  • నిబంధనలు పాటించడం లేదన్న అధికారులు
చిన్నారుల నోరూరించే మ్యాగీ నూడిల్స్ మళ్లీ చిక్కుల్లో పడింది. ల్యాబ్ టెస్టులో మళ్లీ విఫలం చెందింది. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలో యూపీలోని షాజహాన్ పూర్ పరిపాలనాశాఖ అధికారులు నెస్లీ ఇండియా, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులకు భారీ జరిమానా విధించారు. నెస్లేకు రూ. 45 లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు రూ. 15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ. 11 లక్షల జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. సరైన నిబంధనలను పాటించకపోవడం వల్లే నెస్లే ఇండియాకు జరిమానా విధించామని చెప్పారు.
maggi noodles
nesle india
fine to nesle india

More Telugu News