GES 2017: నమ్మండి డూడ్... ఇది హైదరాబాద్ నగరమే!

  • ఏదో ఫారిన్ కంట్రీలా కనిపిస్తున్న హైదరాబాద్
  • హోటల్ గది నుంచి ఫోటో తీసిన ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కోసం వచ్చిన ఓ విదేశీ పాత్రికేయుడు పెట్టిన హైదరాబాద్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న 'స్విర్ లింగ్ మీడియా' తరఫున హాజరైన పాట్రిక్ రిచర్డ్ సన్ తన హోటల్ గది నుంచి బయట కనిపిస్తున్న దృశ్యాన్ని బంధించి పోస్టు చేశారు. హైదరాబాద్ కు వచ్చేశామని, ఇక నిద్రించే సమయం ఆసన్నమైందని క్యాప్షన్ పెట్టాడు. ఏదో విదేశాల్లో బహుళ అంతస్తుల భవనాలు, విశాలమైన రోడ్లు కలిగున్న నగరంలా ఉందే తప్ప, ఇదే మన హైదరాబాద్ అంటే నమ్మేలా లేదు. సాయం సంధ్యవేళ హోటల్ గది నుంచి కనిపిస్తున్న దృశ్యమిది. మీరూ చూడండి!
GES 2017
Hyderabad
Raheja IT park

More Telugu News