Komatireddy: పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి!

  • కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న వెంకటరెడ్డి
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కసిగా ఓడించాలని పిలుపు
  •  చనిపోయినా తనపై కాంగ్రెస్ జెండా ఉంటుందన్న ఎమ్మెల్యే
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, తనకు వ్యతిరేకంగా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా తనపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని స్పష్టం చేశారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఇలాంటి నేతకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు అండగా ఉండే కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలిచి టీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను కసిగా ఓడించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
Komatireddy
Telangana
KCR
Congress
TRS

More Telugu News