మెట్రోరైల్ ప్రారంభం నేపథ్యంలో బొంతు రామ్మోహన్కి అవమానం అంటూ వార్తలు.. ఖండించిన హైదరాబాద్ మేయర్!
- మోదీ ఆవిష్కరించిన పైలాన్లో కనిపించని బొంతు రామ్మోహన్ పేరు?
- తీవ్ర మనస్తాపానికి లోనై ఆయన రాజీనామా చేశారని వార్తలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన హైదరాబాద్ మేయర్
దీంతో సోషల్ మీడియాల్లో తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, వీటిని ప్రచారం చేస్తోన్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ ను రామ్మోహన్ ఆశ్రయించారు. ఈ రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డ మెట్రోరైల్ పైలాన్లో రామ్మోహన్ పేరు లేదని, ఆయన బీసీకి చెందిన వ్యక్తి కాబట్టే ఆయన పేరు కనిపించలేదని కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు.