mahesh kathi: సింపుల్.. ఇలాంటి కంటెంట్ లీగల్ గా రాత్రి 11 తరువాత రావాలి: మ‌హేశ్‌ క‌త్తి

షార్ట్స్‌లో చూడండి
 టీవీ సీరియ‌ళ్లలో, జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో లాంటి వాటిలో అశ్లీల ప‌దాలు, సీన్లు ఉంటున్నాయ‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటువంటి స్క్రిప్టుల‌ను గ‌ట్టిగా ఖండిస్తోన్న‌ మహేశ్ క‌త్తి సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిప్రాయాన్ని తెలిపారు.

'సినిమాకు సెన్సార్ ఉంది. టీవీకి సెల్ఫ్ సెన్సారింగ్ ఉంటుంది. సినిమాకి వెళ్లాలా? వద్దా? అనేది మన ఛాయ్స్. టీవీ నట్టింట్లో ఉంటుంది. ప్రైమ్ టైం టీవీ అనేది ఛాయ్స్ కాదు. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చేసే విషయం. దేని సమస్యలు దానికి ఉన్నాయి.. సింపుల్...' అని పేర్కొన్నారు. అటువంటి ప్రోగ్రాంలు వ‌చ్చేట‌ప్పుడు సింపుల్‌గా ఛానెల్ చేంజ్ చేస్తే అయిపోతుందిగా.. అని ఓ నెటిజ‌న్ అడ‌గ‌గా.. 'ఛానెల్ చేంజ్ చెయ్యడానికి ఆప్షన్స్ కూడా పెద్దగా లేవు. ఇలాంటి కంటెంట్ లీగల్ గా రాత్రి 11 తరువాత రావాలి.. సింపుల్..' అని రిప్లై ఇచ్చారు.   
Go Back to Shorts
mahesh kathi
simple
suggetion
jabardasth

More Telugu News