GES: 'లేడీస్ అండ్ జెంటిల్మన్' అంటూ దేశ ఘన చరిత్రను చెబూతూ ప్రారంభమైన జీఈ సదస్సు!

  • హెచ్ఐసీసీలో ఘనంగా జీఈఎస్ ప్రారంభవేడుకలు 
  • భారత చరిత్రను తెలుపుతూ ఏవీ ప్రదర్శన 
  • టెక్నాలజీతో కలగలిసిన అద్భుతమైన నృత్యరూపకం
 గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 (జీఈఎస్-2017) హైదరాబాదులోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. నేటి ఉదయం నుంచి సెషన్ల వారీగా సదస్సులు నిర్వహించిన నిర్వాహకులు సాయంత్రం సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఏవీని ప్రదర్శిస్తూ, పురాతన కాలం నుంచి భారత దేశం విద్య, వైజ్ఞానిక, అంతరిక్ష, జ్యోతిష్య, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. పురాతన కాలంలోనే అంతరిక్ష రహస్యాలను ఛేదించిన భారత్ కు సంబంధించిన వీడియోతో పాటు నృత్యరూపకానికి టెక్నాలజీని జతచేసి ప్రదర్శించారు. ఇది ఆహూతులను అద్భుతంగా అలరించింది. 
GES
HICC
Hyderabad
hyd globel summit

More Telugu News