kirti suresh: పవన్ కల్యాణ్ చూసేందుకు అలా ఉంటారంతే... అబ్బో.. చాలా ఫన్నీ!: కీర్తి సురేష్

  • పవన్ కల్యాణ్ సెట్స్ లో చాలా జోక్స్ వేస్తారు
  • ఆయన జోక్స్ ని అంతా ఆస్వాదిస్తాం
  • త్రివిక్రమ్ మంచి చమత్కారి
పవన్ కల్యాణ్ చూసేందుకు పైకి నిశ్శబ్దంగా ఉంటారు కానీ, సెట్స్ లో చాలా ఫన్నీ అని ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ తెలిపింది. ఇటీవలే తన డబ్బింగ్ ముగిసిందంటూ తెలిపిన కీర్తి సురేష్, ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌ తెరవెనుక చాలా జోక్స్‌ వేస్తుంటారని తెలిపింది. ఆయన వేసే జోక్స్ కు త్రివిక్రమ్‌, అను (అను ఇమ్మానుయేల్‌), యూనిట్‌ మొత్తం నవ్వుకుంటుంటామని చెప్పింది.

‘అజ్ఞాతవాసి’ సినిమా యూనిట్ మొత్తం పెద్ద కుటుంబంలా ఉంటామని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌ 25వ ప్రాజెక్టులో నటించడాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపింది. త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ లో చమత్కారం ఉంటుందని చెప్పింది. తన పాత్రలో అలాంటి చమత్కారంతో కూడిన డైలాగులు చాలా ఉన్నాయని చెప్పింది. తాము షూటింగ్ సందర్భంగా ఆ డైలాగులకు వచ్చే స్పందనను ఊహించుకుని సరదాగా గడిపే వారమని కీర్తి తెలిపింది. త్రివిక్రమ్ ఉత్సాహంగా, పాజిటివ్ మైండ్ తో ఉంటారని చెప్పింది. కాగా, కీర్తి సురేష్ ‘అజ్ఞాతవాసి’, సావిత్రి బయోపిక్ ‘మహానటి’, విక్రమ్‌ ‘సామి 2’, సూర్య ‘తానా సేంద కూట్టం’ అనే సినిమాల్లో నటిస్తోంది. 
kirti suresh
Pawan Kalyan
trivikram
ajnatavasi
movie

More Telugu News