ivanka trump: కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఇవాంక ట్రంప్!

  • ముఖ్యమంత్రి కేసీఆర్ తో కరచాలనం చేసిన ఇవాంక
  • స్వాగతం పలికిన కేసీఆర్
  • సదస్సులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఇవాంకా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాదులో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. హెచ్ఐసీసీ సభామందిరంలో ఇవాంక చాలా బిజీగా గడుపుతున్నారు. మెట్రో రైలును ప్రారంభించి హెచ్ఐసీసీకి వచ్చిన ప్రధాని మోదీతో ఆమె భేటీ అయ్యారు. మోదీతో అరగంటకు పైగా చర్చలు కొనసాగించిన తర్వాత ఆమె మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు.

అనంతరం ఎస్కలేటర్ ద్వారా ఆమె కిందకు వచ్చారు. ఆమె కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వేచి చూస్తున్నారు. కిందకు రాగానే కేసీఆర్ ను ఆమె నవ్వుతూ పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదుకు వచ్చిన ఇవాంకకు కేసీఆర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత నరసింహన్, నిర్మలతో కూడా ఇవాంక కరచాలనం చేశారు. అనంతరం ఆమె జీఈఎస్ సదస్సులోకి అడుగుపెట్టారు. 
ivanka trump
KCR

More Telugu News