pavan kalyan: పవన్ 26వ సినిమాకి మొదలైన సన్నాహాలు!

  • పవన్ 25వ సినిమాగా 'అజ్ఞాతవాసి' 
  • ఆ తరువాత పూర్తిస్థాయి రాజకీయాలంటూ ప్రచారం 
  • అది నిజం కాదన్నట్టుగా రంగంలోకి దిగిన మైత్రీ మూవీస్ 
  • త్వరలో పూర్తి స్క్రిప్ట్ విననున్న పవన్      
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన 25వ సినిమాగా 'అజ్ఞాతవాసి'ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన మైత్రీ మూవీస్ బ్యానర్లో సినిమా చేయకపోవచ్చనే టాక్ వినిపించింది. కానీ పవన్ 26వ సినిమాను చేయడానికి మైత్రీ మూవీస్ వారు సన్నాహాలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

ఇటీవలే మైత్రీ మూవీస్ వారు ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ తెరిచారట. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ .. తన టీమ్ తో కలిసి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. 'అజ్ఞాతవాసి' సినిమా షూటింగ్ పూర్తి కాగానే, పవన్ కి ఒకసారి ఈ స్క్రిప్ట్ ను వినిపిస్తారట. బాగుంది అని ఆయన అంటే .. వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోయేలా మైత్రీ మూవీస్ వారు ప్లాన్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
pavan kalyan
santhosh srinivas

More Telugu News