Narendra Modi: విమానాశ్రయంలో బీజేపీ నేత‌ల‌తో ప్రధాని మోదీ భేటీ

  • భేటీలో పాల్గొన్న బీజేపీ నేత‌లు ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డి, కృష్ణంరాజు
  • ప్ర‌సంగించ‌నున్న మోదీ
  • కాసేప‌ట్లో మెట్రోరైల్ ప‌రుగులు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్న విష‌యం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన బీజేపీ నేత‌ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి బీజేపీ నేత‌లు ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డి, కృష్ణంరాజు తదితరులు హాజ‌ర‌య్యారు. కాసేప‌ట్లో ప్రధాని మోదీ... గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, ఇతర మంత్రులతో క‌లిసి మెట్రోరైల్‌లో ప్ర‌యాణించ‌నున్నారు.

నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలు మరికొద్ది సేపట్లో పట్టాలెక్కబోతోంది. మోదీ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మెట్రోరైల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
Narendra Modi
Hyderabad
metro

More Telugu News