ivanka trump: ఉల్లాసంగా, ఉత్సాహంగా మాటలు కలుపుతున్న ఇవాంకా ట్రంప్!

  • అధికారులను, సిబ్బందిని పరిచయం చేసిన యూఎస్ రాయబారి, కాన్సులేట్ జనరల్
  • అందరినీ నవ్వుతూ పలకరించిన ఇవాంకా ట్రంప్
  • నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె
  • మరికాసేపట్లో హెచ్ఐసీసీకి పయనం
ఈ తెల్లవారుజాము నుంచి ట్రైడెంట్ హోటల్ లో బస చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, తనను పలకరిస్తున్న వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాటలు కలుపుతున్నారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఇవాంకాకు అమెరికా రాయబారి కెనెట్, కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ స్వాగతం పలికారు.

ఆపై హోటల్ వద్ద వారిరువురూ స్థానిక అధికారులను, హోటల్ మేనేజ్ మెంట్ ను పరిచయం చేస్తుండగా, వారితో ఇవాంకా మాట్లాడారు. ఆపై ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకుని స్వల్పంగా అల్పాహారం స్వీకరించినట్టు సమాచారం. అప్పుడు కూడా తనకు కనిపించిన ప్రతి వారినీ అమె పలకరిస్తూనే ఉన్నారని హోటల్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికా నుంచి వచ్చిన ఇవాంక కాన్వాయ్ లో 17 యూఎస్ వాహనాలే ఉండటం గమనార్హం. ఆమె పర్యటన కోసం అమెరికా నుంచి సొంత బులెట్ ప్రూఫ్ వాహనాన్ని తెప్పించారు కూడా. హోటల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని 150 భవనాల నుంచి అక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు పహారా కాస్తున్నాయి. మరికాసేపట్లో ఆమె హెచ్ఐసీసీ చేరుకుంటారు.
ivanka trump
Hyderabad
HICC
GES

More Telugu News