Narendra Modi: ఢిల్లీలో విమానమెక్కిన నరేంద్ర మోదీ!

  • ఢిల్లీలో బయలుదేరిన నరేంద్ర మోదీ
  • మధ్యాహ్నం తరువాత బేగంపేటకు
  • అక్కడి నుంచి డైరెక్టుగా మియాపూర్ కు మోదీ
హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక మెట్రో రైలును ప్రారంభించడంతో పాటు, ఆ తరువాత హెచ్ఐసీసీ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో జరిగే ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో బయలుదేరారు. ప్రత్యేక వాయుసేన విమానంలో ఆయన బయలుదేరారు. మరో రెండు గంటల వ్యవధిలో ఆ విమానం బేగంపేట ఎయిర్ పోర్టుకు రానుంది. ఆపై ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో మియాపూర్ కు మోదీ బయలుదేరుతారు. మోదీకి స్వాగతం పలికేందుకు మధ్యాహ్నం 1.30 గంటల తరువాత కేసీఆర్ తో పాటు ప్రొటోకాల్ అధికారులు బేగంపేటకు చేరుకోనున్నారు.
Narendra Modi
GES
begumpet

More Telugu News