manchu lakshmi: లక్ష్మీ మంచుకు అరుదైన అవకాశం... జీఈఎస్ లో మాట్లాడేందుకు ఆహ్వానం

  • ప్యానల్ డిస్కషన్ లో పాల్గొనాలని ఆహ్వానం
  • ఎంతో సంతోషంగా ఉందన్న మంచు లక్ష్మి
  • అనుభవాలను వెల్లడిస్తానని చెప్పిన మంచు వారమ్మాయి 
టాలీవుడ్ సెలబ్రిటీ, నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించే అపూర్వ అవకాశం లభించింది. ఇంతటి ఘనమైన అవకాశం లభించడంపై లక్ష్మి స్పందిస్తూ, "భారత మహిళల తరఫున మాట్లాడే అవకాశం లభించడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సదస్సులో ఎన్నో కేటగిరీలు ఉండగా, సినిమాల్లో మహిళలు, వారి పాత్రపై నేను మాట్లాడాలని నన్ను పిలవలేదు.

మహిళల్లో ఔత్సాహికత, మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే సవాళ్లు, వారి జీవితాల్లో సమతుల్యం వంటి అంశాలపై మాట్లాడనున్నాను. నా స్వీయ అనుభవాలను, నా జీవితం నాకు నేర్పిన పాఠాలను ఇక్కడ పంచుకోబోతున్నా. ఆపై జరిగే చర్చలో నా అభిప్రాయాలను వెల్లడిస్తాను" అని చెప్పుకొచ్చింది. ఇవాంకకు తాను స్వాగతం పలుకుతున్నానని, ఇక్కడ ఉండే సమయం ఆమెకు మరపురాని అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నానని వెల్లడించింది.
manchu lakshmi
GES
Hyderabad

More Telugu News