akhil: అఖిల్ తో చేయడానికి ఓకే చెప్పిన కొరటాల .. ఈలోగానే మరో దర్శకుడితో అఖిల్!

  • అఖిల్ 3వ సినిమాపై ఆసక్తి 
  • బోయపాటి .. కొరటాల బిజీ 
  • వెయిట్ చేయలేని అఖిల్
  • నెక్స్ట్ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి  
అఖిల్ రెండవ సినిమాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమా రూపొందింది. వచ్చేనెల 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన 3వ సినిమా ఎవరితో ఉండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంలో మొదట బోయపాటి శ్రీను పేరు వినపడింది .. కానీ ఆయన చరణ్ ను సెట్ చేసుకున్నాడు. ఆ తరువాత కొరటాల శివ పేరు వినిపించింది. ఈ లోగా ఆయన అల్లు అర్జున్ తో చేయడానికి సిద్ధమైపోయాడు.

అయితే అఖిల్ తో చేయడానికి కూడా కొరటాల ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటికే అఖిల్ తన రెండవ సినిమాకే చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. అందువలన అల్లు అర్జున్ మూవీని కొరటాల పూర్తి చేసేవరకూ అఖిల్ వెయిట్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల కంటే ముందుగా మరో దర్శకుడితో .. మరో కొత్త కథతో అఖిల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దర్శకుడెవరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  
akhil
koratala

More Telugu News