hello: అవినాష్ కు 'హలో' చెప్పనున్న నాగ్, అమల, సమంత!

  • 'హలో' చిత్రంలో గెస్ట్ రోల్స్
  • అఖిల్ తో 'హలో అవినాష్' అని పలకరించే పాత్రలు
  • చిత్రంలో అఖిల్ పేరు అవినాష్
అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కోడలు సమంతలు ఓ సినిమాలో కనిపించనున్నారు. అక్కినేని అభిమానులకు ఐ ఫీస్ట్ గా నిలిచేలా వీరు ముగ్గురూ కలిసి అఖిల్ హీరోగా నటిస్తున్న 'హలో'లో కనిపిస్తారట. ఈ సినిమాలో అఖిల్ పేరు అవినాష్ కాగా, వీరు ముగ్గురూ అఖిల్ ను కలిసి 'హలో అవినాష్' అని పలకరిస్తారని టాలీవుడ్ టాక్. అక్కినేని కుటుంబంతో 'మనం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన విక్రమ్ కుమార్, అఖిల్ రెండో చిత్రం 'హలో'కూ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల కాగా, వాటికి మంచి స్పందన వచ్చింది. వచ్చే నెల 22న ఈ సినిమా వెండితెరలను తాకనుంది.
hello
Nagarjuna
amala
samantha
manam

More Telugu News