mukhesh ambani: ప్రత్యేక విమానంలో హైదరాబాదు చేరుకున్న ముఖేష్ అంబానీ

  • రేపు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) 
  • 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు 
  • ముందుగానే హైదరాబాదు చేరుకున్న ముఖేష్ 
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ హైదరాబాదు చేరుకున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ముఖేష్ అంబానీ ముందుగా హైదరాబాదు చేరుకున్నారు. కాగా, రేపటి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్, పలువురు రాయబారులు, మంత్రులు, ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. 
mukhesh ambani
GES
Hyderabad

More Telugu News