నేను చేయనున్నది ప్రేమకథేగానీ .. 'తొలిప్రేమ' కాదు: సాయిధరమ్ తేజ్

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన తదుపరి సినిమా కరుణాకరన్ దర్శకత్వంలో వుండనుంది. ఈ నేపథ్యంలో 'తొలి ప్రేమ'నే రీమేక్ చేస్తున్నారనే టాక్ వచ్చింది.

ఇదే విషయాన్ని గురించి సాయిధరమ్ తేజ్ దగ్గర ప్రస్తావించగా, ఆయన స్పందిస్తూ .. "నేను కాదు .. 'తొలిప్రేమ' టైటిల్ తో వరుణ్ చేస్తున్నాడు. కరుణాకరన్ తో నేను చేయనున్నది లవ్ స్టోరీనే గానీ, దానికి .. 'తొలిప్రేమ'కి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథ పూర్తి భిన్నంగా .. కొత్తగా  ఉంటుంది. కరుణాకరన్ కాంబినేషన్ కావడం వలన .. అదీ లవ్ స్టోరీ కావడం వలన అలాంటి రూమర్స్ వచ్చి ఉంటాయి" అన్నాడు. దాంతో ఇది 'తొలిప్రేమ'కి రీమేక్ అనీ .. సీక్వెల్ అని జరుగుతూ వస్తోన్న ప్రచారానికి తెరపడినట్టు అవుతుందని అనుకోవాలి.     


More Telugu News