jupalli krishna rao: తెలంగాణ మంత్రి జూపల్లిని అడ్డుకున్న రేవంత్ రెడ్డి సోదరుడు!

  • బీటీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన జూపల్లి
  • సర్పంచ్ కూడా లేకుండానే శంకుస్థాపన ఏమిటని అడ్డుకున్న తిరుపతి రెడ్డి
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసేందుకు జూపల్లి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అడ్డుకున్నారు. కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని నిలదీశారు. తిరుపతిరెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు శంకుస్థాపన చేయకుండా జూపల్లిని అడ్డుకున్నారు.

 దీంతో, అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని, ఇరు వర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం, శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని జూపల్లి అక్కడ నుంచి కదిలారు.
jupalli krishna rao
Revanth Reddy
TRS
Congress

More Telugu News