Pawan Kalyan: కొత్త ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కల్యాణ్

  • @pkcreativeworks పేరుతో కొత్త ఖాతా
  • పూర్తిగా సినిమాలకే ఈ ఖాతా అంకితం
  • నాకు ప్రేమను, శక్తిని ఇచ్చిన సినీ రంగాన్ని గౌరవిస్తా
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కు ఇప్పటికే అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది. తన మనసులోని భావాలను, అభిప్రాయాలను ప్రజలు, అభిమానులతో పంచుకునేందుకు ఈ అకౌంట్ ను వేదికగా ఆయన ఉపయోగించుకుంటున్నారు. తాజాగా @pkcreativeworks పేరుతో ఆయన మరో ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ ను పూర్తిగా సినిమాలకు చెందిన విషయాలను వెల్లడించడానికే ఆయన ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

"నాకు ప్రేమను, శక్తిని ఇచ్చిన సినీ రంగానికి గౌరవాన్ని, ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా. సమాజానికి మరింత మెరుగైన సేవ చేసేందుకు ఈ రంగాన్ని ఉపయోగించుకుంటా. ఈ కొత్త ట్విట్టర్ అకౌంట్ ను పూర్తిగా సినిమాల కోసమే ప్రారంభించా" అంటూ పవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ నటిస్తున్నారు. 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
Pawan Kalyan
janasena
tollywood
pawan kalyan new twitter

More Telugu News