Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాల వల్ల యువత ప్రభావితులవుతారన్నది నిజం కాదు!: జేడీ చక్రవర్తి
- పవన్ చేస్తోన్న సేవ వల్ల ప్రభావితులవుతున్నారు
- పవన్ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు
- సినిమాల వల్ల కాకుండా ఆ సేవ వల్ల ఓట్లు పడతాయి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సినీ నటుడు జేడీ చక్రవర్తి అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ సినిమాల వల్ల యువత.. ఆయన పట్ల ప్రభావితులవుతారన్నది నిజం కాదని, పవన్ చేస్తోన్న సేవ వల్ల ప్రభావితులవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే పవన్‌కు ఆయన సినిమాల వల్ల కాకుండా ఆ సేవ వల్ల ఓట్లు పడతాయని వ్యాఖ్యానించారు. ఇక తనకు రాజకీయాల గురించి అంతగా తెలియదని, తనకు వాటిపై ఆసక్తి కూడా లేదని చెప్పారు.
కాగా, సినిమాలకు విశ్లేషకులు ఇచ్చే రివ్యూలను తాను పట్టించుకోనని జేడీ చక్రవర్తి చెప్పారు. రివ్యూలు సినిమాలపై ఎటువంటి ప్రభావమూ చూపవని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక తనకు ఫేస్బుక్, ట్విట్టర్లో ఖాతాలు లేవని స్పష్టం చేశారు.