పొట్టి డ్రస్ వేస్తే మాత్రం కెమెరా యాంగిల్ చూడాల్సిందే: రకుల్ ప్రీత్ సింగ్
- కెమెరా ఎక్కడుందో చూడకుంటే అభాసుపాలు
- ఎబ్బెట్టుగా కనిపించకుండా జాగ్రత్త పడతా
- కుదిరితే తెలుగబ్బాయినే చేసుకుంటానేమో
- అందాలతార రకుల్ ప్రీత్ సింగ్
'లౌక్యం' చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ గురించి ప్రస్తావిస్తూ, ఆ చిత్రంలో లో-యాంగిల్ లో కెమెరా పెట్టాలని నిర్ణయించుకోగా, ఎబ్బెట్టుగా కనిపించకుండా కేర్ తీసుకున్నానని చెప్పిన రకుల్, కొన్ని సార్లు కెమెరా విషయంలో నటించేవారికి అవగాహన ఉండాలని, లేకుంటే అభాసుపాలు కావాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. రాత్రిపూట బాగా తింటానని, ఆపై పొద్దున్నే ఆ శక్తిని కరిగించేందుకు వర్కౌట్లతో శ్రమిస్తుంటానని వెల్లడించిందీ స్టార్ హీరోయిన్. ఇక తన పెళ్లి గురించి స్పందిస్తూ, పెళ్లి చేసుకున్న తరువాత నార్త్ లో స్థిరపడేది లేదని, భర్తనే హైదరాబాద్ కు తెచ్చుకుంటానని, ఒకవేళ ఎవరైనా తెలుగబ్బాయి నచ్చితే, ఇక్కడి కోడలినే అవుతానని చెప్పింది.