viraj: 'అనగనగా ఓ ప్రేమకథ' షూటింగ్ మొదలు

షార్ట్స్‌లో చూడండి
ప్రేమ కథలను ఫీల్ తో తెరకెక్కించాలే గానీ .. యూత్ వాటికి నీరాజనాలు పడుతుంది. అందువలన యూత్ కి కనెక్ట్ అయ్యేలా ప్రేమకథలను తెరకెక్కించడానికి కొత్తగా వచ్చిన దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇక కొత్త హీరో .. హీరోయిన్లు కూడా లవ్ స్టోరీస్ ద్వారానే పరిచయం కావడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు.

ఈ క్రమంలో ఈ రోజున 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కెఎల్ ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత నివాసంలో ఆయనే క్లాప్ కొట్టగా .. సీనియర్ ఫైనాన్షియర్ సత్య రంగయ్య కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. మార్తాండ్ కె. వెంకటేశ్ గౌరవ దర్శకత్వం వహించారు.

 ఈ సినిమాకి టి. ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఇతను ఎన్.శంకర్ దగ్గర అసోసియేట్ గా పనిచేశాడట. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ మేనల్లుడు విరాజ్. జె. అశ్విన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక కథానాయికలుగా రిద్ధి కుమార్ .. రాధా బంగారు కనిపించనున్నారు.
Go Back to Shorts
viraj

More Telugu News