jabardast show: హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై కేసు నమోదు.. అనాథలకే నా మద్దతు అన్న కత్తి మహేష్

  • ఫిర్యాదు చేసిన అనాథ పిల్లలు
  • కేసు నమోదైందని వెల్లడించిన కత్తి మహేష్
  • నా మద్దతు అనాథలకే అంటూ కామెంట్
వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జిలుగా వ్యవహరిస్తున్న 'జబర్దస్త్' కార్యక్రమంపై రోజురోజుకూ విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో అసభ్యత శ్రుతి మించుతోంది. ఇదే సమయంలో అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా జోకులు ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. షోలో తమ మనోభావాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జాబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవావని కోరారు. ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. తన మద్దతు అనాథలకే అని చెప్పాడు.
jabardast show
kashi mahesh
hyper adi

More Telugu News