Murali Vijay: మురళీ విజయ్ సెంచరీ.. పుజారా హాఫ్ సెంచరీ.. చెమటోడుస్తున్న లంక బౌలర్లు

  • నాగపూర్ లో మరో అధ్భుత ఇన్నింగ్స్ ఆడిన విజయ్
  • టెస్టుల్లో 10వ సెంచరీ నమోదు
  • 62 పరుగులతో అండగా ఉన్న పుజారా
నాగపూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అదరగొట్టాడు. తన కెరీర్ లో 10వ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 187 బంతులను ఎదుర్కొన్న మురళీ విజయ్... 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఈ ఘనతను సాధించాడు. మరో ఎండ్ లో చటేశ్వర్ పుజారా 62 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కంటే భారత్ మరో 29 పరుగులు వెనుకబడి ఉంది. మురళీ, పుజారాలు ఇప్పటి వరకు 163 పరుగుల పార్ట్ నర్ షిప్ ను నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు లంక బౌలర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఫలితం దక్కడం లేదు. 
Murali Vijay
chateswar pujara
nagapur test
team india

More Telugu News