Donald Trump: బాబోయ్.. ఆ అవార్డు నాకు వద్దు: 'టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'ను తిరస్కరించిన ట్రంప్

  • టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2017 అవార్డు నాకిస్తున్నట్టు తెలిసింది
  • ఫొటో షూట్ లో పాల్గొనలేను
  • ఈ అవార్డు నాకు వద్దు
'టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - 2017' అవార్డును తిరస్కరించాలని నిర్ణయించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టైమ్స్ పర్సన్ గా తాను ఎంపిక కానున్నాననే సమాచారం అందిందని... ఒకవేళ ఎంపికైతే మేగజీన్ కవర్ ఫొటో కోసం ఫొటో షూట్ చేయాల్సి ఉంటుందని... అది తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. ఈ అవార్డును తాను స్వీకరించబోనని చెప్పారు.

గతంలో ఈ అవార్డు కోసం ట్రంప్ ఉబలాటపడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడం పట్ల ట్రంప్ నిప్పులు చెరిగారు కూడా. 2016లో ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మరోవైపు, ట్రంప్ ట్వీట్ పై టైమ్స్ స్పందించింది. అవార్డు ఇచ్చేందుకు తాము అనుసరించే విధానాల గురించి తెలుసుకోకుండానే ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది.
Donald Trump
us president
times person of the year 2017

More Telugu News