'సైరా'లో అతిథి పాత్రలో పవన్ కనిపించడం ఖాయమే!
- గతంలో చిరూ సినిమాల్లో మెరిసిన పవన్
- 'సైరా'లోను పవన్ కనిపించనున్నాడంటూ టాక్
- అది నిజమేనంటూ అందుతోన్న సంకేతాలు
ఈ వార్త నిజమేననేది తాజా సమాచారం. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది .. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్ ను సంప్రదించగా .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అన్నయ్య పట్ల గల ప్రేమ .. చారిత్రక చిత్రాల పట్ల గల ఆసక్తి కారణంగానే పవన్ ఈ సినిమాలో చేయడానికి అంగీకరించాడని అంటున్నారు.