america: 'బీ రెడీ'... అమెరికా, జపాన్ లకు ఉత్తరకొరియా హెచ్చరికలు!

  • ఉగ్రవాద దేశాల జాబితాలో తమను చేర్చడంపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా
  • అమెరికా వాదనకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయి
  •  భవిష్యత్ పరిణామాలకు అమెరికా, జపాన్ సిద్ధంగా ఉండాలి
  •  గువామ్ ద్వీపంపై అణ్వాయుధ దాడి జరిగితీరుతుంది
ఉగ్రవాద దేశాల జాబితాలో అమెరికా తమను చేర్చడంపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఆ దేశాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు తాము అణ్వాయుధాలు తయారు చేయడం లేదని చెప్పిన ఉత్తరకొరియా, తమ దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలను సమకూర్చుకుంటున్నామని స్పష్టం చేసింది.

అమెరికాకు దక్షిణకొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా గతంలో తాము ప్రకటించిన విధంగా అమెరికాకు చెందిన గువామ్ ద్వీపంపై న్యూక్లియర్ మిసైల్ దాడి జరుపుతామని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలకు అమెరికా, జపాన్ దేశాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ, ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 
america
Japan
North Korea
warning

More Telugu News