nara rohith: 'బాలకృష్ణుడు'లో డిస్కవరీ మాధవరావుగా పృథ్వీ అదరగొట్టేశాడట!

  • ఈ రోజే విడుదలైన 'బాలకృష్ణుడు' 
  • డిస్కవరీ మాధవరావు పాత్రలో పృథ్వీ 
  • ఆయన పాత్రలో కావాల్సినంత కామెడీ 
  • ఆడియన్స్ నుంచి దక్కుతోన్న ప్రశంసలు  
పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన 'బాలకృష్ణుడు' ఈ రోజునే భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో కమెడియన్ పృథ్వీకి మంచి పాత్ర లభించింది. నాయకా నాయికలతో పాటు ఈ పాత్ర జర్నీ కొనసాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఆయన 'డిస్కవరీ మాధవరావు' అనే పాత్రలో ఫొటోగ్రాఫర్ గా కనిపిస్తారు. ఆయన ఎంట్రీతోనే థియేటర్స్ లో సందడి మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది.

పృథ్వీ కామెడీ ట్రాక్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనీ, తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ ను పేలుస్తూ ఆడియన్స్ కి గిలిగింతలు పెట్టారని చెబుతున్నారు. పృథ్వీ పాత్ర ఎంటరైన దగ్గర నుంచి ఎండ్ టైటిల్స్ పడేవరకూ ఆయన కామెడీ కొనసాగిందనీ, ప్రేక్షకులు ఆశించే కామెడీ ఆయన పాత్ర నుంచి పుష్కలంగా లభించిందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పృథ్వీకి పడిన మంచి రోల్ ఇదేననీ .. ఈ పాత్ర ఇండస్ట్రీలో ఆయనని మరి కొన్నాళ్ల పాటు నిలబెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
nara rohith
regina
prithvi

More Telugu News