BANDLA GANESH: చెక్ బౌన్స్ కేసులో.. బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష, భారీ జరిమానా!

షార్ట్స్‌లో చూడండి

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆరు నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15లక్షల 86వేల 550 రూపాయల జరిమానా విధించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఈ శిక్షను విధించింది.

వివరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాకు వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో, తనకు నిర్మాత బండ్ల గణేష్ చెల్లని చెక్ ఇచ్చారంటూ వక్కంతం వంశీ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం, బండ్ల గణేష్ బెయిల్ కు దరఖాస్తు పెట్టుకోగా... జడ్జి బెయిల్ మంజూరు చేశారు. 
Go Back to Shorts
BANDLA GANESH
TOLLYWOOD
IMPRISIONMENT FOR BANDLA GANESH

More Telugu News