r narayana murty: దీపికా పదుకునే తలను నరకమంటారా.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?: ఆర్.నారాయణమూర్తి

షార్ట్స్‌లో చూడండి
'పద్మావతి' సినిమా ఇంకా విడుదల కానేలేదు, ఎవరూ చూడనే లేదు... ఇలాంటి పరిస్థితిలో ఆ సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆ సినిమాలో నటించిన దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలకు వెలకట్టడం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా? అంటూ మండిపడ్డారు.

 నంది అవార్డులు ఎవరి సొత్తు కాదని... ప్రజలు చెల్లించిన పన్నులతోనే వాటిని అందజేస్తున్నారని చెప్పారు. గుణశేఖర్ రూపొందించిన 'రుద్రమదేవి'కి అవార్డు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. అవార్డుల విషయంలో పునరాలోచించుకోవాలని సూచించారు. గతంలో ఉత్తమ సినిమాలను ఎంపిక చేసేటప్పుడు అవి సమాజం, సంస్కృతి, సంప్రదాయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయనే విషయాన్ని పరిశీలించేవారని... ప్రస్తుతం ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది? అనేవి చూస్తున్నారని చెప్పారు. 
Go Back to Shorts
r narayana murty
tollywood
nandi awards

More Telugu News