Virat Kohli: విరాట్ కోహ్లీపై షోయబ్‌ అక్తర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం!

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్‌ మాజీ క్రికెట‌ర్‌ షోయబ్‌ అక్తర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. మొన్న‌ శ్రీలంకతో జ‌రిగిన టెస్టులో కోహ్లీ సెంచరీ చేయడంతో 50 ‌సెంచ‌రీల‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షోయ‌బ్ అక్త‌ర్ మాట్లాడుతూ... కోహ్లీని ఆధునిక క్రికెట్ లో గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. ఛేజింగ్‌లో ఇన్నింగ్స్ నిర్మించడంలో విరాట్ ఆట‌ తీరు అద్భుతమ‌ని, కోహ్లీ ఇప్ప‌టికే 50 సెంచరీలు సాధించాడని అన్నాడు.

సచిన్ రికార్డును బ్రేక్ చేసే ఏకైక ఆటగాడు కూడా కోహ్లీనేన‌ని జోస్యం చెప్పాడు. తాను సచిన్‌ తో కోహ్లీని పోల్చడం లేదని చెప్పాడు. సచిన్‌ ఆల్‌ టైమ్‌ గ్రేట్ అని, ఇప్పటి శకంలో కోహ్లి ఒక గొప్ప బ్యాట్స్‌మన్ అని చెప్పాడు. విరాట్ త‌న‌ ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని, కోహ్లీ  44 ఏళ్లు వచ్చే వరకూ కచ్చితంగా క్రికెట్‌ ఆడతాడని అన్నాడు. మొత్తం 120 సెంచ‌రీల వ‌ర‌కు చేసే సామ‌ర్థ్యం విరాట్‌లో ఉంద‌ని అన్నాడు. 
Go Back to Shorts
Virat Kohli
Shoaib Akhtar
Cricket

More Telugu News