nagachitanya: ప్రియమైన శ్రీవారికి శుభాకాంక్షలు చెప్పిన సమంత!

  • నేడు నాగచైతన్య పుట్టిన రోజు
  • భర్తకు శుభాకాంక్షలు చెప్పిన సమంత
  • 'ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా'నన్న అక్కినేని వారి కోడలు 
టాలీవుడ్ యువనటుడు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి సమంత శుభాకాంక్షలు చెప్పింది. ‘హ్యాపీ బర్త్‌ డే మై ఎవ్రీథింగ్‌. నువ్వు జీవితంలో కోరుకున్నవన్నీ దక్కాలని కేవలం కోరుకోను. రోజూ భగవంతుడిని ప్రార్థిస్తాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వారి అభిమానులను ఆకట్టుకుంది. కాగా, 'సవ్యసాచి' సినిమా షూటింగ్ తో 'చై', విశాల్ సినిమా షూటింగ్ తో సమంత బిజీబిజీగా గడుపుతున్నారు. 
nagachitanya
samantha
anupama
birthday

More Telugu News