miss world: మిస్ వరల్డ్ పోటీలు డైనోసార్ల కాలంలోనే అంతరించిపోయాయనుకున్నానే...లేదా? : సోఫియా హయాత్ సంచలన వ్యాఖ్యలు

  • మిస్ వరల్డ్ పోటీలు ఇంకా నిర్వహిస్తున్నారా?
  • ఈ రోజుల్లో కూడా అందాల పోటీలు నిర్వహించడమేంటి?
  • ప్రపంచ అందగత్తె తన అందాన్ని ఇతరులు జడ్జ్ చేయాలని కోరుకుంటుందా?
మిస్‌ వరల్డ్‌ గా హర్యాణాకి చెందిన మానుషి చిల్లార్‌ కిరీటాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా మీడియాలో ఆమెకు సంబంధించిన పలు వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. మరోపక్క జెలసీతో విమర్శించే వారు కూడా తయారయ్యారు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వెళ్లి.. కొన్నాళ్లకు సన్యాసం స్వీకరించి.. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సోఫియా హయాత్ చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తున్నాయి.

‘ఇంకా ఈ మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్నారా? డైనోసార్ల కాలంలోనే ఈ పోటీలు అంతరించిపోయాయనుకున్నానే... ఇంకా లేదా? అయినా ఈ రోజుల్లో అందాన్ని జడ్జ్‌ చేయడమేంటి? ఇలాంటి పోటీలను చూస్తుంటే నవ్వొస్తోంది. అందం ఉన్నది జడ్జ్‌ చేయడానికి కాదు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో హిజాబ్‌ వేసుకున్న యువతులు, ట్రాన్స్‌ జెండర్లు, గుండు చేయించుకున్న అమ్మాయిలు ఎందుకు లేరు? అంటే వారు అందంగా లేరనా? మిస్‌ వరల్డ్‌ ఎప్పుడో పాతపడిపోయింది. నిజమైన ప్రపంచ సుందరి అంటే.. 'అమ్మ'. ప్రపంచ సుందరి తన అందాన్ని ఎప్పుడూ జడ్జ్ చేయాలని భావించదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
miss world
manush chiller
sofia hayath

More Telugu News