sagarika: అధికారికంగా ఒక్క‌టైన సాగ‌రిక‌, జ‌హీర్ ఖాన్‌లు

  • ఇవాళ ఉద‌యం పెళ్లి రిజిస్ట‌ర్ చేయించుకున్న జంట‌
  • ఫొటోలు షేర్ చేసిన జ‌హీర్ స్నేహితురాలు
  • న‌వంబ‌ర్ 27న ముంబైలో రిసెప్ష‌న్‌
క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్‌, న‌టి సాగ‌రిక ఘ‌ట్కేలు ఇవాళ ఉద‌యం ఒక్క‌ట‌య్యారు. త‌మ పెళ్లిని అధికారికంగా ఈ జంట రిజిస్ట‌ర్ చేయించుకుంది. ఈ తంతు ఫొటోల‌ను జ‌హీర్ స్నేహితురాలు, ప్రోస్పోర్ట్ ఫిట్‌నెస్ స్టూడియో మార్కెటింగ్ హెడ్ అంజ‌నా శ‌ర్మ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. న‌వంబ‌ర్ 27న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ అండ్ ట‌వ‌ర్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గనుంది. వివాహ రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను సాగ‌రిక స్నేహితురాలు, చ‌క్ దే ఇండియాలో ఆమె స‌హ‌న‌టి విద్యా మాల్వంక‌ర్ షేర్ చేసింది.
sagarika
zaheer khan
marriage
wedding
register
reception
mumbai

More Telugu News