sunjuy manjrekar: టీమిండియాకు సూపర్ స్టార్ బౌలర్లు కావాలి!: సంజయ్ మంజ్రేకర్

  • టీమిండియాలో బౌలింగ్ సూపర్ స్టార్లు లేరు
  • పాకిస్థాన్ క్రికెట్ హీరోలంతా బౌలర్లే
  • భువీ, బుమ్రా, ఉమేష్ రాణిస్తున్నా...సూపర్ స్టార్ కావాలి
టీమిండియాకు సూపర్ స్టార్ బౌలర్ కావాలని మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌ లో క్రికెట్ ఆడేవారందరి దృష్టి బ్యాటింగ్‌ మీదే ఉంటుందని అన్నాడు. అదే పాకిస్థాన్‌ ను తీసుకుంటే అలా ఉండదని అన్నాడు. అక్కడి సూపర్‌ స్టార్లంతా పేస్ బౌలర్లేనని గుర్తు చేశాడు. ఇమ్రాన్‌ ఖాన్‌, వసీమ్‌ అక్రమ్, వకార్‌ యూనిస్, షోయబ్ అక్తర్ ఇలా పాక్ క్రికెట్ హీరోలంతా బౌలర్లేనని అన్నాడు.

భారత్ క్రికెట్ ప్రపంచానికి బ్యాటింగ్‌ లో గొప్ప ఆటగాళ్లను అందించింది కానీ, బౌలింగ్‌ లో మాత్రం ఆ స్థాయిలో అందించలేకపోయిందని ఆయన పేర్కొన్నాడు. గతంలో కంటే ప్రస్తుతం పరిస్థితి బాగుందని, బుమ్రా, భువనేశ్వర్‌, ఉమేష్ లాంటి మ్యాచ్ మలుపు తిప్పే ఆటగాళ్లను చూస్తున్నామని తెలిపాడు. ఇది టీమిండియాకు శుభపరిణామమని అభిప్రాయపడ్డాడు. ఐతే బ్యాట్స్‌ మెన్‌ ను ఆరాధించినట్టు, బౌలర్లను కూడా ఆరాధించాలని, అలా అభిమానులే వారిని హీరోలుగా చేయాలని సూచించాడు. సమర్థుడైన బౌలింగ్ సూపర్ స్టార్ వస్తే తరువాతి తరాలకు స్పూర్తిగా నిలుస్తాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 
sunjuy manjrekar
commentetor
team india
pacers

More Telugu News