namitha: మెహిందీ ఫంక్షన్ లో మెరిసిపోయిన నటి నమిత.. వీడియో మీరూ చూడండి!

  • రేపే నమిత పెళ్లి
  • రేపు తెల్లవారుజామున తిరుపతిలోని ఇస్కాన్ లో వివాహం
  • చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్
అందాల నటి నమిత పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు అయిన వీరేంద్ర చౌదరిని ఆమె వివాహం చేసుకోబోతోంది. రేపు ఉదయం తెల్లవారుజామున 5.30 గంటలకు తిరుపతిలోని ఇస్కాన్ లో వీరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి నమిత, వీరేంద్రల కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరవుతున్నారు. అనంతరం చెన్నైలో వీరు గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వీరి మెహిందీ ఫంక్షన్ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. కాబోయే భార్యాభర్తలిద్దరితో పాటు వారి బంధుమిత్రులు కూడా ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నమిత మరింతగా మెరిసిపోయింది. తన కాబోయే భర్తతో కలసి ఎంతో ఆనందంగా గడిపింది. వీడియో మీరూ చూడండి.  
namitha
namitha marriage
tollywood
kollywood

More Telugu News