Ivanka Trump: ఇవాంకా కోసం ఐదుగంటలపాటు విమానాలను ఆపేయాలన్న యూఎస్.. కుదరదన్న అధికారులు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ రాక కోసం భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఆమె భద్రత కోసం దాదాపు నెల ముందే హైదరాబాద్ చేరుకున్న అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏర్పాట్లను రహస్యంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాంకా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు, ఆ తర్వాత దాదాపు ఐదు గంటలపాటు ఇతర విమానాలను అనుమతించవద్దని  సీక్రెట్ సర్వీస్ ప్రతినిధులు విమానాశ్రయ యాజమాన్యానికి లేఖ రాశారు.

ఆ లేఖను చూసిన అధికారులు షాక్ తిన్నారు. ఆమె కోసం షెడ్యూల్ ప్రకారం రోజువారీ  నడిచే సర్వీసులను నిలిపివేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రయాణికుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్టు సమాచారం. దీనికి తోడు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇవాంకా ల్యాండ్ అయ్యే శంషాబాద్ విమానాశ్రయం అంత సేఫ్ కాదని హెచ్చరించడంతో, ల్యాండింగ్ ను బేగంపేట విమానాశ్రయానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Ivanka Trump
America
Telangana

More Telugu News