ntr: 150 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్-చరణ్ లతో రాజమౌళి మూవీ?

షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి తదుపరి సినిమా ఏమిటనే విషయంలో అందరూ ఎంతో ఆసక్తితో వున్నారు. ఆయన నుంచి ఏ సమయంలో ఏ ప్రకటన వెలువడుతుందా అని ఆత్రుతగా వున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. చరణ్ లతో కలిసి తాను దిగిన ఫోటోను రాజమౌళి ట్విట్టర్ లో పెట్టడం అందరిలో ఆనందాశ్చర్యాలను రేకెత్తించింది. ఎన్టీఆర్ .. చరణ్ లతో ఓ మల్టీ స్టారర్ ను రాజమౌళి తెరకెక్కించనున్నాడని అంతా బలంగా నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా 150 కోట్లతో నిర్మితం కానుందనేది తాజా సమాచారం. ఎవరి పాత్రకి వుండే ప్రాధాన్యత వాళ్లకి ఇస్తూ .. ఇద్దరి ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. బోయపాటితో చరణ్ .. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వేసవిలో పూర్తి కానున్నాయి. అందువలన రాజమౌళి ఈ మల్టీ స్టారర్ ను వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభించి, 2019 వేసవిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాడని అంటున్నారు.       
Go Back to Shorts
ntr
charan
Rajamouli

More Telugu News