Donald Trump: ఫొటోలు దిగ‌డంలో ట్రంప్‌ను ఫాలో అయిన కిమ్ జాంగ్ ఉన్‌

షార్ట్స్‌లో చూడండి
విచిత్ర హావ‌భావాలు ప‌లికిస్తూ, ట్ర‌క్కు న‌డుపుతూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ దిగిన ఫొటోలు ఇటీవ‌ల వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే త‌ర‌హాలో ఉత్త‌ర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా ట్ర‌క్కు న‌డుపుతూ ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ట్రంప్‌ని అనుక‌రించిన కిమ్... అంటూ వారిద్ద‌రి ఫొటోల‌ను ఇప్పుడు నెటిజ‌న్లు వైర‌ల్ చేస్తున్నారు.

ఉత్త‌ర కొరియాలోని దక్షిణ ప్యాంగ్యాంగ్‌ ప్రావిన్స్‌లోని సుంగ్రి మోటర్‌ కాంప్లెక్స్‌ను కిమ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన ట్రంప్‌లా ట్రక్కులో ఎక్కి ఫొటోలకు పోజులిచ్చారు. మరోపక్క కిమ్‌ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా ఆ దేశం ఎలాంటి క్షిపణి ప్రయోగాలకు పాల్పడడంలేదని వార్తలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కిమ్‌ ఇలా ట్రక్కులో దిగిన ఫొటోలు బయటికి రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నారని ఇక మళ్లీ క్షిపణి ప్రయోగాలు చేస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Donald Trump
america
kim jong un
north korea
viral
social media

More Telugu News