Nara Lokesh: అఖిలప్రియను ప్రశంసించిన నారా లోకేష్!

  • అఖిలప్రియ చాలా బాగా పని చేస్తున్నారు
  • మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారన్న వార్తలు అవాస్తవం
  • ఇప్పట్లో మంత్రి వర్త విస్తరణ లేదు
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియపై నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని చెప్పారు. కేబినెట్ నుంచి అఖిలప్రియను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇప్పట్లో మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచన లేదని... మీడియాలో వార్తలు రాసేసి, వివరణ అడిగితే ఎలాగని లోకేష్ ప్రశ్నించారు.

విజయవాడలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం దురదృష్టకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారని... ప్రమాదానికి బాధ్యులైన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీలో తమ కుటుంబానికి ఆధార్, ఓటర్ ఐడీ ఉందా? లేదా? అంటూ కొంత మంది వెతుకుతున్నారని... ఏపీలో ఓటు హక్కు లేకపోతే ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ ఎలా అవుతానంటూ ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోనే తన కుమారుడు దేవాన్ష్ కు కూడా ఆధార్ కార్డు ఉందని చెప్పారు. 
Nara Lokesh
akila priya
Telugudesam
ap cabenet

More Telugu News