deepika padukone: అమరావతికి పద్మావతి రావడం ఆనందకరం.. స్క్రీన్ మీద చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నా!: యాంకర్ అనసూయ

  • సోషల్ మీడియా అవార్డుల ఫంక్షన్ కు వచ్చిన దీపికా పదుకోనే 
  • అమరావతికి పద్మావతి రావడం ఆనందకరమన్న అనసూయ
  • తెరపై ఆమె అందం, అభినయం చూసేందుకు ఎదురు చూస్తున్నా
సోషల్ మీడియా అవార్డుల వేడుక రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే రావడం ఫంక్షన్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా దీపిక అవార్డును స్వీకరించింది.

ఈ కార్యక్రమంలో యాంకర్ గా అనసూయ హల్ చల్ చేసింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఫేస్ బుక్ ద్వారా పంచుకుంది అనసూయ. "అమరావతికి పద్మావతి రావడం ఎంతో సంతోషకరం. దీపిక పోరాట యోధురాలు. తెరపై నీ అందం, అభినయాన్ని చూడటానికి ఉవ్విళ్లూరుతున్నా" అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
deepika padukone
anasuya
tollywood
bollywood

More Telugu News