NDTV: ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ నారాయణరావు మృతి
- రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నారాయణరావు
- 1995లో ఎన్డీటీవీలో జనరల్ మేనేజర్‌గా చేరిక
- ఆయన మృతి తీరని లోటన్న ఎన్డీటీవీ
ప్రముఖ జాతీయ చానల్ ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేవీఎల్ నారాయణరావు (63) మృతి చెందారు. గత రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న నారాయణరావు సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఎన్డీటీవీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనకు భార్య రేణు, ఇద్దరు కుమారులు జయంత్, అర్జున్ ఉన్నారు.
1995లో ఛానల్‌లో జనరల్ మేనేజర్‌గా చేరిన నారాయణరావు అంచెలంచెలుగా ఎదిగి ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో స్థాయికి ఎదిగారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఎన్డీటీవీ పేర్కొంది.